నేటి నుంచి దేవీనవరాత్రి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి దేవీనవరాత్రి ఉత్సవాలు

Oct 11 2026 5:24 AM | Updated on Oct 11 2026 5:24 AM

● విద్యుత్‌దీపాల వెలుగుల్లో మండపాలు

జనగామ: దేవీ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని జిల్లాలో నేటి (ఆదివారం) నుంచి నవరాత్రి పూజలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా ఉత్సవ కమిటీలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. జిల్లాకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం, గణపతి ఆలయం, శ్రీ విల్లాస్‌ కాలనీ, పాత బీడు బజార్‌, రెడ్డి స్ట్రీట్‌ బొడ్రాయి, బతుకమ్మకుంట, కురుమవాడ, బాలాజీనగర్‌ తదితర ప్రాంతాల్లో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అమ్మవారి మండపాలను ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. విద్యుత్‌దీపాలతో అలంకరించడంతో పాటు ఆలయాలను తలపించేలా ప్రత్యేక సెట్టింగులు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నారు.

నేటినుంచి సోమేశ్వరాలయంలో

శరన్నవరాత్రి ఉత్సవాలు

పాలకుర్తి టౌన్‌: మండలకేంద్రలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేటి నుంచి (ఆదివారం) ఈనెల 20వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. చండికాదేవి అమ్మవారు 11న శ్రీబాలాత్రిపురసుందరీదేవి, 12న శ్రీగాయత్రిదేవి, 13న శ్రీఅన్నపూర్ణాదేవి, 14న శ్రీమహాలక్ష్మీదేవి, 15న శ్రీలలితా త్రిపురసుందరీదేవి, 16న శ్రీసరస్వతీ దేవి, 17న శ్రీచండీకాదేవి, 18న శ్రీదుర్గాదేవి, 19న శ్రీమహిషాసుర మర్ధినీదేవి, 20న శ్రీరాజరాజేశ్వరీ దేవి (దసరా శమీ వృక్ష పూజ)గా భక్తులకు దర్శనం ఇస్తారని ఈఓ తెలిపారు.

తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోని గణపతి దేవాలయంలో.. పాతబీటుబజార్‌ వద్ద..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement