దేవరుప్పుల: జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శని వారం మండలంకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. జనగామ జిల్లా ఏర్పడి దశాబ్ద కాలం అయినా సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలా భిషేకం చేయాలన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. జనగామ జిల్లా ఏర్పడి తర్వాత జనగామ ప్రాంతం అనేక విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. నేడు జిల్లాకేంద్రంలో నిర్వహించే వేడుకలకు జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘనపూర్ నియోజవర్గ నాయకులు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి


