తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ: పల్లా | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ: పల్లా

Oct 11 2026 5:24 AM | Updated on Oct 11 2026 5:24 AM

జనగామ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే బతుకమ్మ పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆకాంక్షించారు. శని వారం జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని నియోజకవర్గ ప్రజలకు, ఆడపడుచులకు శు భాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని ఆరాధిస్తూ రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు, ఆటలతో తొమ్మిది రో జుల పాటు నిర్వహించే ఈ వేడుకలు మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు.

అంతర్జాతీయ వడ్రంగి

పోటీల్లో ప్రతిభ

స్టేషన్‌ఘన్‌పూర్‌: చైనా వేదికగా ఇటీవల జరిగిన అంతర్జాతీయ వడ్రంగి పోటీల్లో మండలంలోని విశ్వనాఽథపురం గ్రామానికి చెందిన కేశోజు యశ్వంత్‌చారి ఉత్తమ ప్రతిభతో ఐదోస్థానంలో నిలిచారు. సాంప్రదాయ కులవృత్తులు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో వృత్తిపై నమ్మకం, నైపుణ్యం, పట్టుదల ఉంటే ప్రపంచస్థాయిలో గుర్తింపు సాధించవచ్చని నిరూపిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. చైనాలో జరిగిన ఈ పోటీల్లో 25 దేశాలు పాల్గొనగా యశ్వంత్‌చారి ఐదోస్థానాన్ని కై వసం చేసుకున్నారు. ఈ మేరకు యశ్వంత్‌చారిని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మల సంఘం నాయకులు అభినందించారు.

‘రైతులకు ఇబ్బందులు కలగొద్దు’

జనగామ రూరల్‌: రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌ అన్నారు. శనివారం జనగామ మండలంలోని షామీర్‌పేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, పారదర్శకంగా ధాన్యం సేకరించాలన్నారు. కొనుగోలు కేంద్రంలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం నరేందర్‌, సర్పంచ్‌ గణిపాక వనిత మహేందర్‌ డీటీ సీఎస్‌ లు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement