జనగామ: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పనిచేస్తున్న 22 మంది విదేశీ వైద్య విద్యార్థులు మూడో రోజు శనివారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. భారతదేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన హౌస్ సర్జన్లకు నెలకు రూ.29,900 స్టైఫండ్ చెల్లిస్తుండగా, విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన తమకు కేవలం రూ.5 వేలు మా త్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కూడా 90 శాతం వైద్య సేవలు అందిస్తున్నందున సమాన స్టైఫండ్ చెల్లించాలని ప్లకార్డులు, బతుకమ్మలతో నిరసన చేపట్టారు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని వైద్య మండలి కార్యాలయం ఎ దుట ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు.


