జనగామ రూరల్: స్వతంత్ర సంస్థగా పనిచేయాల్సిన కేంద్ర ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని, ప్రజాస్వామ్యానికి మచ్చలా మారిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇప్పటివరకు తొలగించిన 13 కోట్ల ఓట్లపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం 2023ను రద్దు చేయాలని, ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు చంద్రశేఖర్ రావు, నల్లనాగుల రాజు, షరీఫ్,శాడ రవి. మడూరి వెంకటేష్, అంకూషా వళి, శ్రీనివాస చారి, లక్ష్మయ్య కృష్ణ, వజ్రయ్య, శ్రీనివాసులు, సయ్యద్ శ్రీనివాసులు, గణేష్, తదితరులు పాల్గొన్నారు.


