హోరాహోరీగా ‘ఆర్టీసీ’ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా ‘ఆర్టీసీ’ ఎన్నికలు

Oct 10 2026 1:34 AM | Updated on Oct 10 2026 1:34 AM

● జనగామ డిపోలో 400 ఓట్లకు

396 పోలింగ్‌

● ఈయూ–ఎన్‌ఎంయూ కూటమికి

అనధికారిక ఆధిక్యం

జనగామ: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జనగామ డిపోలో శుక్రవారం హోరాహోరీగా సాగాయి. డిపో పరిధిలో మొత్తం 400 ఓట్లు ఉండగా 396 ఓట్లతో 99 శాతం పోలింగ్‌ నమోదైంది. ఓట్ల లెక్కింపు అనంతరం అందిన అనధికారిక సమాచారం ప్రకారం ఈయూ–ఎన్‌ఎంయూ ఐక్య కూటమి అధిక్యం సాధించడంతో ఆ కూటమి నాయకులు సండురాలు చేసుకున్నారు. అయితే అధికారిక ఫలితాలు ఈ నెల 17న వెలువడనున్నాయి.

ఉదయం 5 నుంచి పోలింగ్‌

జనగామ డిపోలో శుక్రవారం ఉదయం 5 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అనంతరం సాయంత్రం 6.45 గంటలకు షురూ అయిన ఓట్ల లెక్కింపు రాత్రి 8 గంటలకు పూర్తయింది. క్లాస్‌–3 రాష్ట్ర స్థాయి, క్లాస్‌–6 ప్రాంతీయ స్థాయి విభాగాలకు సంబంధించి కార్మికులు వేర్వేరుగా ఓట్లు వేశారు. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ వరంగల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆధ్వర్యంలో, జనగామ లేబర్‌ ఆఫీసర్‌ కుమారస్వామి పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు. డిపో మేనేజర్‌ ఉష, సీఐ హుస్సేన్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ నెట్‌ రాఘవేందర్‌, సూపరింటెండెంట్‌ మురళీధర్‌ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.

కూటముల మధ్య పోటీ

ఈయూ–ఎన్‌ఎంయూ ఐక్యకూటమి, టీడబ్ల్యూయూ–ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఐక్య కూటమితో పాటు టీజేఎంయూ, బీడబ్ల్యూయూ వేర్వేరుగా పోటీ చేశాయి. కార్మికులను ఆకట్టుకునేందుకు సంఘాల నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. దీంతో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్‌ సమయంలో ఏజెంట్లు పరిశీలించిన ఓట్ల సరళి ఆధారంగా ఈయూ–ఎన్‌ఎంయూ కూటమి ఆధిక్యం సాధించినట్లు అనధికా రికంగా ప్రచారం జరిగింది. దీంతో ఆ కూటమి నాయకులు, మద్దతుదారులు సంబురాలు జరుపుకున్నారు. కూటమి తరఫున డిపో కార్యదర్శి వీఎస్‌ఆర్‌రెడ్డి, అధ్యక్షుడు ఏ.శ్రీనివాస్‌, చైర్మన్‌ జె.శ్రీనివాస్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలరాజు, గ్యారేజీ కార్యదర్శి అంజయ్య, ఎన్‌ఎంయూ తరఫున డిపో కార్యదర్శి అంజయ్య, అధ్యక్షుడు జి.ఎస్‌.రెడ్డి, జాయింట్‌ సెక్రటరీ పి.మహేందర్‌, సహాయ కార్యదర్శి రమేష్‌, టీవీ రత్నం, సందీప్‌ అనధికారిక లెక్కల ప్రకారం ఆధిక్యం సాధించగా వారిని సత్కరించారు. ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఈయూ–ఎన్‌ఎంయూ కూటమి నాయకులు శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐలు చెన్నకేశవులు, నర్సయ్య, రతీష్‌ బందోబస్తును పర్యవేక్షించారు.

ఓట్లు ఇలా(అనధికారం)

క్లాస్‌–3(స్టేట్‌)

టీడబ్ల్యూయూ/

ఎస్‌డబ్ల్యూఎఫ్‌:145

ఈయూ/ఎన్‌ఎంయూ:248

టీజేఎంయూ:01

చెల్లనివి:02

క్లాస్‌–6(రీజియన్‌)

టీడబ్ల్యూయూ/

ఎస్‌డబ్ల్యూఎఫ్‌:165

ఈయూ/ఎన్‌ఎంయూ:224

టీజేఎంయూ:04

బీడబ్ల్యూయూ:03

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement