పాలకుర్తి టౌన్: పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.21,98,507 సమకూరినట్లు ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న తెలిపారు. 2026 మార్చి 24 నుంచి అక్టోబర్ 9 వరకు భక్తులు హుండీలో వేసిన కానుకలను శుక్రవారం ఆలయ కల్యాణ మండంపంలో లెక్కించారు. వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఈఓ వెంకట్‌రెడ్డి పర్యవేక్షణలో హుండీ ఆదాయంను లెక్కించారు. మిశ్రమ బంగారం 5 గ్రాముల 580 మిల్లి గ్రాములు, మిశ్రమ వెండి కేజీ 359.740 మిల్లి గ్రాములు, యూఎస్ డాలర్స్ 230, ఇంగ్లాడ్ 30 పౌండ్స్, నేపాల్ రూపీ 150 వచ్చినట్లు ఈఓ తెలిపారు.
జీజీహెచ్‌లో జూనియర్ డాక్టర్ల నిరసన
జనగామ: స్ట్ఫైండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ జనగామ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్), ఎంసీహెచ్‌లో పని చేస్తున్న 22 మంది విదేశీ వైద్య పట్టభద్రులు (ఎఫ్‌ఎంజీ) జూనియర్ డాక్టర్లు శుక్రవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ప్రస్తుతం తమకు నెలకు రూ.5 వేల స్టైఫండ్ మాత్రమే చెల్లిస్తుండగా, భారతదేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన హౌస్ సర్జన్లకు రూ.29,900 ఇస్తున్నారని పేర్కొన్నారు. తాము కూడా సమానంగా వైద్య సేవలందిస్తున్నందున అదే స్థాయిలో స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. నేడు (శనివారం) జిల్లా వ్యాప్తంగా విధులు నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని డీఎంబీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు.
గోదావరి జలాలతో
ఏనచెరువు నింపండి
జనగామ రూరల్: జిల్లాలోని వడ్లకొండ గ్రామంలోని ఏనచెరువును గోదావరి జలాలతో నింపి ఎండిపోతున్న తమ పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వడ్లకొండ, పెద్దపాడు గ్రామాల రైతులు జనగామ – హుస్నాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. పురుగుమందు డబ్బాలతో నిరసన తెలిపారు. ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ధర్నా విరమించాలని కోరగా వినకపోవడంతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఏనచెరువు కింద వందలాది ఎకరాల్లో వేసిన పంటలు నీరు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువును గోదావరి నీటితో నింపాలని గతంలోనే కలెక్టర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం, నీటిపారుదల శా ఖ అధికారులు ఏనచెరువుకు గోదావరి జలాల ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎల్లబో యిన హరీశ్, నాయకులు శానబోయిన మహిపా ల్, రైతులు దండుబోయిన కుమార్, చిలువేరు రాజు, నామాల అంజనేయులు, వడ్లకొండ పెద్దపాడు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
జేవీవీ కృషి అభినందనీయం
జనగామ రూరల్: శాస్త్రేయ విజ్ఞాన వ్యాప్తిలో జేవీవీ కృషి అభినందనీయం జేవీవీ రాష్ట్ర బాధ్యుడు శ్రీనాథ్ అన్నారు. శుక్రవారం జనవిజ్ఞాన వేదిక 6వ జిల్లా మహాసభలు రవీందర్ అధ్యక్షతన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ.. మూఢవిశ్వాసాలను వీడి ప్రజలంతా సైన్స్‌ను అనుసరించడం ద్వారా మాత్రమే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం రాష్ట్ర బాధ్యుడు శ్రీనాథ్ ఎన్నికల అధికారిగా, రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాస రా వు పరిశీలకులుగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ గోపాల్‌రెడ్డి , డాక్టర్ మనస్విని, డాక్టర్ మాచర్ల భిక్షపతి, అధ్యక్షులుగా బాలరాజు, ప్రధాన కార్యదర్శి కనకయ్య, కోశాధికారి లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా కేఎల్ మర్రెడ్డి, చంద్రశేఖర్‌రావు, ఉమాదేవి, శోభన్‌బాబు, కార్యదర్శులుగా రవీందర్, సత్తయ్య, కృష్ణ అంజనేయాచారి, శ్రీనివాస్ ని ఎన్నుకున్నారు.


