నేడు ఎంగిలిపూల బతుకమ్మ
● ఎల్‌నినో ఎఫెక్ట్‌తో కానరాని అడవిపూలు
● మార్కెట్‌ను ఆశ్రయిస్తున్న మహిళలు
జనగామ: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు నేటినుంచి ప్రారంభమై తొ మ్మిది రోజులు కొనసాగనున్నాయి. మరోవైపు బతుకమ్మకు ఉపయోగించే తంగేడు, గునుగు, గడ్డి పూ లు, నేల చామంతి తదితర ప్రకృతి సిద్ధమైన పూల కు కొరత ఏర్పడింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో పూల లభ్యత తగ్గడంతో గతంలో అడవులకు వెళ్లి పూలు సేకరించే కుటుంబాలు సైతం ఇప్పుడు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా బొడ్డెమ్మ పండగకు వీడ్కోలు పలుకుతూ బతుకమ్మ పండగకు స్వాగతం పలికేందుకు మహిళలు సిద్ధమయ్యారు.
పూల కొరత.. నిమజ్జనంపై సందిగ్ధం
వర్షాభావ పరిస్థితుల కారణంగా సంప్రదాయ పూలు ఆశించిన స్థాయిలో లభించడం లేదు. దీంతో కొన్ని గ్రామాలకు చెందిన కుటుంబాలు సుదూర ప్రాంతాల్లోని అడవులకు వెళ్లి పూలను సేకరించి జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో విక్రయిస్తున్నాయి. చెరువుల్లో నీటి నిల్వలు తగ్గడంతో బతుకమ్మ నిమజ్జనంపై సందిగ్ధత నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొనే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షణ చేపట్టనున్నారు.


