జనగామ రూరల్: బీజేపీ ‘ఓట్ చోరీ’పై పోరాటం చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీనియర్ నాయకులు, కూటమి ఎంపీలపై దౌర్జన్యంగా వ్యవహరించడం అమానుషమని, ఇది భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్ మండిపడ్డారు. గురువారం ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బీజేపీ ప్రభుత్వం, జ్ఞానేశ్ కుమార్, మోదీ, అమిత్‌షా దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, ఓటర్ల హక్కులను కాపాడేందుకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. నిరసనలో వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమళ్ళ సత్యనారాయణ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, డాక్టర్ రాజమౌళి, వేముల మల్లేష్, బడికే ఇందిరా, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మాజిద్ అప్సర్, జాయ మల్లేష్, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ అభి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి
జ్ఞానేశ్ కుమార్, మోదీ, అమిత్ షా దిష్టిబొమ్మల దహనం


