ఈ–నామ్‌లో సాంకేతిక లోపం | - | Sakshi
Sakshi News home page

ఈ–నామ్‌లో సాంకేతిక లోపం

Oct 9 2026 2:20 AM | Updated on Oct 9 2026 2:20 AM

జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఈ–నామ్‌ 2.0 వెర్షన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో గురువారం బిడ్డింగ్‌ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ–నామ్‌ సేవల్లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో మధ్యాహ్నం ఒంటి గంటకే పూర్తి కావాల్సిన బిడ్డింగ్‌ ప్రక్రియ సుమారు 2 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. సాంకేతిక సమస్య కారణంగా బిడ్డింగ్‌ మరింత ఆలస్యం కాకుండా మార్కెట్‌ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ–నామ్‌ సేవలు అందుబాటులోకి రాకపోతే రైతులకు ఇబ్బంది కలగకుండా మాన్యువల్‌గా బిడ్డింగ్‌ నిర్వహించేందుకు డీఎంవో సారంగపాణి ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రధాన సర్వర్‌ నుంచి ఈ–నామ్‌ సేవలు పునరుద్ధరించినట్లు సమాచారం అందడంతో మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ప్రారంభించారు. మార్కెట్‌కు గురువారం 5 వేలకుపైగా ధాన్యం బస్తాలు తరలివచ్చాయి. బిడ్డింగ్‌ ఆలస్యమైనప్పటికీ రైతులకు నష్టం కలగకుండా అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టారు.

ఏఎంసీలో ఆలస్యంగా ధాన్యం బిడ్డింగ్‌

5వేల బస్తాలకు పైగా ధాన్యం రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement