బచ్చన్నపేట: పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు పాఠశాల పరిసరాలను కూడా పరి శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండలంలో ని చిన్నరామన్‌చర్ల గ్రామంలోని మండల ప్రజాపరిషత్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, వసతులు, వంట గది, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడు తూ పాఠాలు ఎలా బోధిస్తున్నారని అడిగారు. యూనిఫామ్‌లు అందాయా అని ఆరా తీశారు.
ఈవీఎం గోదాం పరిశీలన
జనగామ రూరల్: ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, నెలవారీ తనిఖీలో భాగంగా గురువారం కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, పరిశీలించారు. భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, మంటల నియంత్రణ పద్ధతుల ను పర్యవేక్షించారు. ఏసీ బెన్‌షాలోమ్ ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఎన్ని కల విభాగం సూపరింటెండెంట్ శ్రీధర్ పాల్గొన్నారు.
సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం


