జనగామ: జిల్లా కేంద్రంలో గుడాల ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏఐ సఖి కార్యక్రమంలో భాగంగా బుధవారం 30 మంది మహిళలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), వివిధ అప్లికేషన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భాగంగా మహిళలకు చిరు వ్యాపారాల అభివృద్ధి, వ్యాపారాలను డిజిటల్‌గా ప్రమోట్ చేసుకునే విధానాలపై అవగాహన కల్పించారు. హైదరాబాద్‌కు చెందిన ఏఐ స్టార్టప్ స్టైకరో ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, సంస్థ ఫౌండర్ మురారి దుండ్రా, ఏఐ ట్రైనర్ బాలాజీ శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బెస్ట్ ఏఐ సఖి అవార్డులు అందజేయనున్నట్లు నిర్వాహకులు కాసాల సంతోష్ కుమార్ తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ గుడాల శ్రీనివాస్, గుడాల వేణు శ్రీధర్ ఉన్నారు.


