నాలుగు ఎకరాల్లో వరి, పత్తి పంట సాగు చేసిన. పంటల పెట్టుబడికి రూ.50 వేలకు పైగా ఖర్చు చేసిన. ఎల్‌నినోతో పంటలపై తీవ్ర ప్రభావం ఉంది. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు గ్యాప్ ఇచ్చి పోస్తున్నాయి.. వరి పొట్ట దశలో ఉంది. కోతకు మరో నెల రోజుల సమయం ఉంది. ఇప్పుడు నీరందకపోతే దిగుబడి తగ్గుతుంది. పైపుల ద్వారా మడులకు తడి అందించే ప్రయత్నం చేసినా ఫలితం కనిపిండం లేదు.
– ఎం.రాజు, రైతు, ఓబులాపూర్, జఫర్‌గఢ్
●
రెండు ఎకరాల్లో వరి సాగు చేసిన. రెండు బోర్ల ద్వారా పొలానికి తడి అందిస్తున్నా.. సాగునీరు అందడం లేదు. తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దు పోయే వరకు పొలం వద్దనే ఉంటూ పైపులను మారుస్తూ మడులకు నీరు పారిస్తున్నా. బోర్లు గ్యాప్ ఇస్తుండడంతో పొట్టదశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నం.
– కామిడి లక్ష్మారెడ్డి, రైతు, బచ్చన్నపేట


