సైబర్‌ నేరాలపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అవగాహన ఉండాలి

Oct 8 2026 1:06 AM | Updated on Oct 8 2026 1:06 AM

జనగామ రూరల్‌: సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన ఉండాలని డీసీపీ రాజామహేంద్ర నాయక్‌ సూచించారు. బుధవారం డీసీపీ కార్యాలయంలో తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో రూపొందించిన సైబర్‌ జాగృతి దివస్‌ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రస్తుతం పెరుగుతున్న సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలు, ఫిషింగ్‌ లింకులు, అనుమానాస్పద ఫోన్‌ కాల్స్‌ సందేశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏసీబీ భీంశర్మ, సీఐ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సేవ సంకల్ప అభియాన్‌లో గడ్డం సమ్మయ్య

దేవరుప్పుల: హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన సేవ సంకల్ప అభియాన్‌ సేవాజ్యోతి యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండలంలోని అప్పిరెడ్డిపల్లెకు చెందిన ప్రముఖ చిందుయక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య హాజరయ్యారు. ఆ కార్యక్రమాన్ని సమ్మయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట అధ్యక్షుడు రాంచందర్‌ రావు పాల్గొన్నారు.

తండాల్లో విద్యుత్‌ పనులపై కేంద్ర బృందం తనిఖీ

పాలకుర్తి టౌన్‌: మండలంలోని కొండాపురం, పెద్దతండాలో బుధవారం పీఎం జుగ పథకం (ప్రధాన మంత్రి జాతీయ ఉన్నత్‌ గ్రామ్‌ అభియాన్‌) కింద చేపట్టిన విద్యుత్‌ పనులను పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పరిశీలించారు. ఆయా తండాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలు, కరెంట్‌ మీటర్లను తనిఖీ చేసి పనుల పురోగతి ని పరిశీలించారు. విద్యుత్‌ సదుపాయాల కల్ప నతో తండాల్లో వెలుగులు నింపడంపై తండా వాసులు ఆనందం వ్యక్తం చేశారు. పథకం అమలు తీరును పరిశీలించిన కేంద్ర బృందం, విద్యుత్‌ మౌలిక వసతుల నాణ్యతను కూడా పరిశీలించింది. కార్యక్రమంలో ఎంఆర్‌టీ డీఈ కన్‌స్ట్రక్షన్‌ విజయ్‌కుమార్‌, ఏడీఈ స్వామిరెడ్డి, ఏఈ రమేశ్‌, విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

దేశ సంక్షేమం కోసం

ప్రధాని మోదీ కృషి

జనగామ రూరల్‌: దేశ సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ కృషి అనిర్వచనీయమని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్‌ అన్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 12 ఏళ్లు, ప్రజా జీవి తంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్‌ ఆధ్వర్యంలో కామాక్షి ఫంక్షన్‌ హాల్‌లో వికసిత్‌ భారత్‌ సంకల్ప సభ నిర్వహించారు. నరేంద్ర మోదీ ప్రసంగం వీక్షించి అనంతరం నెహ్రూ పార్క్‌ నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. యాత్ర ప్రముఖ్‌ శ్రీనివాస్‌, రాష్ట్ర నాయకులు విద్యాసాగర్‌ రెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి, శివరాజ్‌ యాదవ్‌, ఉడుకుల రమేశ్‌, దామోదర్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి అంజిరెడ్డి, నవీన్‌ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి రంగు రాములు, పల్లె కుమార్‌, వివిధ మోర్చాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement