ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలి

Oct 8 2026 1:06 AM | Updated on Oct 8 2026 1:06 AM

జనగామ: పట్టభద్రులు ఓటు హక్కును నమోదు చేసుకుని ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా నిలవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పిలుపు. బుధవారం మండలంలోని యశ్వంతాపూర్‌ బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడా రు. గతంలో ప్రతీ నియోజకవర్గంలో 10 వేల నుంచి 15 వేల వరకు గ్రాడ్యుయేట్‌ ఓటర్లు నమోదయ్యారని, ప్రతీ గ్రామానికి ఒకరు లేదా ఇద్దరు ఇన్‌చార్జ్‌లను నియమించి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, పోలీస్‌ శాఖలో 60 వేలు, సింగరేణిలో 14 వేల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు 12 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు.

ఓటరుగా నమోదు చేసుకోవాలి..

వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతీ గ్రాడ్యుయేట్‌ ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు, జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య, రాకేశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పట్టభద్రులకు ఎమ్మెల్యే

పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement