● వాచ్‌మన్‌పై చర్యలకు ఏఎంసీ తీర్మానం
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)లో చైర్మన్ సంతకం లేకుండా సెప్టెంబర్ 2026కు సంబంధించిన చెక్కులను కేవలం సెక్రటరీ సంతకంతో పాలకవర్గంతో సంబంధం లేకుండా ఎస్‌టీఓ ద్వారా పాస్ చేయించిన వ్యవహారంపై ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ తెలిపారు. ఏఎంసీ యార్డులోని నూతన కార్యాలయంలో బుధవారం పాలకవర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా చైర్మన్ శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ..చైర్మన్ సంతకం లేకుండానే చెక్కులు పాస్ చేయించిన విషయం తెలుసుకుని సిబ్బందిని ప్రశ్నించినట్లు చెప్పారు. ఈ క్రమంలో చైర్మన్‌పై వాచ్‌మన్ ఐలయ్య దురుసుగా ప్రవర్తించాడని పాలకవర్గం మొత్తం గుర్తించిందన్నారు. దీనిపై పాలక వర్గం చర్చించిన అనంతరం వాచ్‌మన్‌ను సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించిందన్నారు. సమావేశంలో ఏఎంసీ డైరెక్టర్లు నాగబండి రవీందర్, నీల మోహ న్, శ్రీలతరెడ్డి, బాష్మియా, నామాల శ్రీనివాస్, తోటకూరి రమేశ్, బన్సీ నాయక్, శీలం కొండల్‌రెడ్డి, పార్ష సిద్దేష్, బండ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయమై ఐలయ్య మాట్లాడుతూ.. పై అధికారులు చెప్పిన మాట ప్రకారం విధులు నిర్వర్తించానని, ఇందులో తన తప్పు ఏమీ లేదని చెప్పారు. ఎలాంటి విచారణకై నా సిద్ధమన్నారు.


