జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక

Oct 7 2026 1:16 AM | Updated on Oct 7 2026 1:16 AM

జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక

చిల్పూరు: మండలంలోని చిన్నపెండ్యాల ప్రభు త్వ పాఠశాలలో చదివే పొగాకుల సుదీప్తి(8వతరగతి), చేపూరి షర్మిళ (9వతరగతి) జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం గుడిమల్ల సంపత్‌కుమార్‌, వ్యాయామ ఉపాధ్యాయుడు రవీంద్ర ప్రసాద్‌ తెలిపారు. మంగళవారం పాఠశాల ఆవరణలో విద్యార్థుల అభినందన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈనెల 4వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించిన నేషనల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్స్ట్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ సెలక్షన్‌ పోటీల్లో పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీ య స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. షర్మిళ 600 మీటర్ల రన్నింగ్‌, సుదీప్తి 600 మీటర్ల రన్నింగ్‌, లాంగ్‌ జంప్‌ విభాగంలో ఎంపికై నవంబర్‌ 14 నుంచి 16వ తేదీ వరకు సదా శివపేటలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. సర్పంచ్‌ తిరుపతమ్మ, ఉప సర్పంచ్‌ సంతోష్‌ తదితరులు అభినందించారు.

రేపు షూటింగ్‌బాల్‌ ఎంపిక పోటీలు

స్టేషన్‌ఘన్‌పూర్‌: డివిజన్‌ కేంద్రంలో జిల్లా స్థాయి షూటింగ్‌బాల్‌ జూనియర్‌ బాలుర ఎంపికలు ఈనెల 8వ తేదీన నిర్వహించనున్నట్లు షూటింగ్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌ అనీల్‌కుమార్‌, అధ్యక్షుడు ఇనుగాల యుగేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 20 సంవత్సరాల వయస్సులోపు క్రీడాకారులు అర్హులని, ఎంపికలకు వచ్చేవారు ఎస్‌ఎస్‌సీ మెమో, ఆధార్‌కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఎంపికై నవారు ఈనెల 10, 11, 12వ తేదీల్లో మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వివరాలకు 90102 55898, 81067 03282 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

సంజయ్‌నగర్‌ మోడల్‌ మార్కెట్‌కు వీధి వ్యాపారులు

జనగామ: పట్టణంలోని ప్రధాన రహదారులు, ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు నిర్వహిస్తున్న వీధి వ్యాపారులను సంజయ్‌నగర్‌లో నిర్మించిన మోడల్‌ మార్కెట్‌కు దశల వారీగా తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్ద డంతో పాటు ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సుమారు రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన సంజయ్‌నగర్‌ మోడల్‌ మార్కెట్‌లో కూరగాయల విక్రయాలకు 50, నాన్‌న్‌వెజ్‌ విక్రయాలకు 65 షాపులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మోడల్‌ మార్కెట్‌లో షాపుల కేటాయింపునకు అర్హత కలిగిన వీధి వ్యాపారుల నుంచి ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు మున్సిపల్‌ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. వ్యాపారులు సహకరించి కేటాయించిన షాపుల్లో వ్యాపారాలు నిర్వహించుకోవాలని కోరారు.

రైస్‌ మిల్లుకు సీల్‌

పాలకుర్తి టౌన్‌: రైస్‌ మిల్లుల్లో అక్రమాలకు పాల్పడితే మిల్లర్లపై చట్టపరమైన చర్యలతో పాటు, మిల్లులు, సంబంధిత ఆస్తులను రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఆదేశాలున్నాయని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ మాచన రఘునందన్‌ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని వావిలాలలోని అన్నపూర్ణ రైస్‌మిల్లులో అక్రమాలు వెలుగుచూసిన నేపథ్యంలో నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు 6–ఏ కేసు నమోదు చేసి, మిల్లును సీల్‌ చేసినట్లు చెప్పారు. తదుపరి చర్యల కోసం కలెక్టర్‌ నివేదిక సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.

అన్ని సౌకర్యాలు కల్పిస్తేనే అనుమతులు

పాలకుర్తి టౌన్‌: నిబంధనల ప్రకారం కొత్తగా ఏర్పాటు చేసే అస్పత్రుల్లో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తేనే అనుమతులు ఇస్తామని డీఎంహెచ్‌ఓ వి.వాణిశ్రీ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో కొత్తగా రిజిష్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రులను డీసీహెచ్‌ఎస్‌ సంధ్యారాణితో కలిసి డీఎంహెచ్‌ఓ వాణిశ్రీ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలకుర్తిలో కొత్తగా రెండు ఆస్పత్రుల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్‌ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో అన్ని అనుమతులు ఉండేలా యాజమాన్యాలు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement