ఓటు హక్కు పరిరక్షణకు ఐక్యపోరాటం | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు పరిరక్షణకు ఐక్యపోరాటం

Oct 7 2026 1:16 AM | Updated on Oct 7 2026 1:16 AM

జనగామ: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ఐక్యంగా పోరాడాలని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ, టీపీసీసీ ఇన్‌చార్జ్‌ సచిన్‌ సావంత్‌ పిలుపునిచ్చారు. ‘సేవ్‌ డెమోక్రసీ వీక్‌–వోట్‌ బచావో, దేశ్‌ బచావో’ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యా లీ నిర్వహించారు. రైల్వేస్టేషన్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్‌ చౌరస్తాలోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు సాగింది. అనంతరం నాయకులు కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని తమ డిమాండ్లతో కూడి న వినతిపత్రాన్ని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాకు అందజేశారు. జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, వైటీడీఏ మెంబర్‌, టీపీసీసీ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణ నాయక్‌, ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర చైర్మన్‌ గంప వేణుగోపాల్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎస్‌ఐఆర్‌ ఇన్‌చార్జి దుద్ధిళ్ల శ్రీనుబాబు, జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి శ్రీనివాస్‌, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, సీపీఐ, టీజేఎస్‌, సమాజ్‌వాదీ పార్టీ భాగస్వామ్య పక్షాల నాయకులు, కార్యకర్తలతో కలిసి సచిన్‌ సావంత్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, ఓటు హక్కు విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని డి మాండ్‌ చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటు హక్కును కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా ఇన్‌చార్జ్‌ ఎండీ అబ్బాస్‌ మాట్లాడుతూ..సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ చేసిన తప్పిదాలకు ప్రజల ఓట్లు తొలగించే పరిస్థితి రావడం దారుణమన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఓటు చోరీ ఆరోపణలపై బీజేపీ ప్రభుత్వం ప్రజ లకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ీకార్యక్రమంలో సీపీఐ నేత సాయన్న, నాయకులు లింగాల జగదీష్‌ చంద్రరెడ్డి, మోకు కనకారెడ్డి, కొత్త కరుణాకర్‌రెడ్డి, నూకల బాల్‌రెడ్డి, వేమల్ల సత్యనారాయణరెడ్డి, వేముల మల్లేష్‌, ఇందిర, మాజిద్‌ అప్సర్‌, దోర్నాల వెంకటేశ్వర్లు, సిద్ధారెడ్డి, మేడ శ్రీనివాస్‌, బెలిదె వెంకన్న, మోకు కనకారెడ్డి, రాపర్తి రాజు, అహల్య, బొట్ల శేఖర్‌, సింగారపు రమేష్‌, ప్రకాష్‌, గోపి, విజయేందర్‌, రమేశ్‌ పాల్గొన్నారు.

ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ సచిన్‌ సావంత్‌

ఇండియా కూటమి ఆధ్వర్యంలో

భారీ ర్యాలీ

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement