‘స్టేషన్‌’ కౌన్సిల్‌ రసాభాస | - | Sakshi
Sakshi News home page

‘స్టేషన్‌’ కౌన్సిల్‌ రసాభాస

Oct 7 2026 1:16 AM | Updated on Oct 7 2026 1:16 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఘన్‌పూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అత్యవసర మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా, వాడీవేడిగా జరిగింది. మున్సిపాలిటీ పరిఽధిలో బతుకమ్మ, విజయదశమి పండుగ ఏర్పాట్ల గురించి కమిషనర్‌ రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశం ఆద్యంతం రసాభాసగా కొనసాగింది. అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 18వ వార్డు కౌన్సిలర్‌ పొన్న రవితో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన బూర్ల రాజేశ్వర్‌, పొన్న రాజేష్‌, తాటికొండ మధు, బాలగాని అనీల్‌ పలు అంశాలపై కమిషనర్‌ను, చైర్మన్‌ను నిలదీశారు. మున్సిపల్‌ సిబ్బందిని కమిషనర్‌, చైర్మన్‌ తమ వాహనాలకు డ్రైవర్లుగా నియమించుకోవడంపై ప్రశ్నించారు. ఇప్పటికే సి బ్బంది తక్కువగా ఉండగా, ఉన్న సిబ్బందిని డ్రైవర్లుగా ఎలా నియమించుకుంటారని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మాట్లాడుతూ.. ఇటీవల జరి గిన వినాయకచవితి, బోనాలు తదితర పండుగల సమయంలో అత్యవసర సమావేశాలు నిర్వహించకుండా ప్రస్తుతం బతుకమ్మ, దసరా పండుగకు సమావేశం నిర్వహించడంలో ఆంతర్యమేమిటన్నా రు. ప్రతీ నెలా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని, మూడు నెలలకు ఒకసారి జనరల్‌ బా డీ మీటింగ్‌ నిర్వహించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ ఎందుకు సమావేశాలు ఏర్పాటు చేయడం లేద ని ప్రశ్నించారు. కలెక్టర్‌ ఆదేశిస్తేనే సమావేశాలు ఏర్పాటు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఒక దశలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ రాజేశ్వర్‌ మాట్లాడుతుండగా కౌన్సిలర్‌ బెదిరిస్తున్నారా అంటూ మాట్లాడటంతో వాగ్వాదం జరిగింది. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, సరైన ప్రోటోకాల్‌ పాటించడం లేదని మండిపడ్డారు.

అభివృద్ధికి అందరూ సహకరించాలి

అన్ని వార్డుల అభివృద్ధిక ప్రత్యేక చొరవతో పనిచేస్తానని, పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని మున్సిపల్‌ చైర్మన్‌ వినయ్‌కుమార్‌ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్‌, శివునిపల్లి, ఛాగల్లు గ్రామాల్లో దసరా పండుగకు సజావుగా ఏర్పాట్లు చేసేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నీల రాజమ్మగట్టయ్య, ఏఈ అనీల్‌, మేనేజర్‌ సత్యనారాయణ, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

అత్యవసర సమావేశంలో కమిషనర్‌తో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల వాగ్వాదం

మున్సిపాలిటీ ఖర్చుల వివరాలను తెలపాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement