జనగామ: విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా పంపిణీ ట్రాన్‌న్స్‌ఫార్మర్ల నిర్వహణ, విద్యుత్ పరికరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని జనగామ నోడల్ అధికారి, ఎస్‌ఈ(ఎన్పీడీసీఎల్) పి.శ్రీకాంత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జనగామ డివిజన్‌న్‌లోని ఎస్పీఎం షెడ్‌ను ఆయన పరిశీలించారు. షెడ్‌లోని విద్యుత్ పరికరాల నిర్వహణ, పంపిణీ ట్రానన్స్‌ఫార్మర్లకు సంబంధించిన పనులు, అందుబాటులో ఉన్న సామగ్రిని పరిశీలించి అధికారులతో సమీక్షించారు. రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. జనగామ ఎస్‌ఈ చెరుకు సంపత్‌రెడ్డి, ఆయా విభాగల అధికారులు పాల్గొన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్‌లో..
స్టేషన్‌ఘన్‌పూర్: విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జనగామ నోడల్ అధికారి పి.శ్రీకాంత్ అన్నారు. డివిజన్‌కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్ షెడ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఘన్‌పూర్‌లో విద్యుత్ వినియోగం పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని నూతన ఎస్‌పీఎం షెడ్ నిర్మాణం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఎంఆర్‌టీ డీఈ వినయ్‌కుమార్, ఘన్‌పూర్ ఆపరేషన్ డీఈ సారయ్య, ఏడీఈ రణధీర్‌రెడ్డి, ఏఈలు శంకర్, శివకుమార్, శ్వేత, సుమన్, లైన్‌మన్‌లు పాల్గొన్నారు.
జిల్లా నోడల్ అధికారి,
ఎస్‌ఈ(ఎన్పీడీసీఎల్) పి.శ్రీకాంత్


