కంటిచూపు ఎలా ఉందమ్మా..? | - | Sakshi
Sakshi News home page

కంటిచూపు ఎలా ఉందమ్మా..?

Oct 7 2026 1:16 AM | Updated on Oct 7 2026 1:16 AM

లింగాలఘణపురం: ‘కంటి చూపు ఎలా ఉందమ్మా..? కంటిపై పొర ఏర్పడినట్లు ఉంది..మంచిగా కనిపిస్తుందా..’ అంటూ మండలంలోని వడిచర్ల పాఠశాలలో పనిచేసే స్కావెంజర్‌ జోగు ఎల్లమ్మను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అడిగి తెలుసుకున్నారు. మంగళవారం పాఠశాలను ఆకస్మిక తని ఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల పరిశీలన, మధ్యాహ్న భోజన సరకుల నాణ్యత, ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల అభ్యసన సామర్థ్యం తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో రోజువారీ వేతనంతో పని చేసే ఎల్లమ్మ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పాఠశాలలో కుర్చీలు తక్కువగా ఉన్నాయని దృష్టికి తేగా 15 బెంచీలు తెప్పిస్తానని చెప్పారు. ఎంఈఓ విష్ణుమూర్తికి చెప్పడంతో నేలపోగులలో అదనంగా ఉన్న బెంచీల ను తెప్పించారు. కలెక్టర్‌తో పాటు సర్పంచ్‌ కార్తీక్‌, హెడ్మాస్టర్‌ సరిత, ఉపాధ్యాయులు ఉన్నారు.

వృద్ధురాలిని ఆరా తీసిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement