● ఎంపీడీఓ వేదవతి
పాలకుర్తి టౌన్: ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించి ఆరోగ్యకరమైన వాతావారణం కల్పించేందుకు భాగస్వాములు కావాలని ఎంపీడీఓ వేదవతి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల పరిసరాల్లో నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, వార్డు సభ్యులు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.


