స్టేషన్‌ఘన్‌పూర్: ప్రతి ఒక్కరూ సాధ్యమైనంతలో సరైన పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ ఏసీడీపీఓ శోభారాణి, తాటికొండ సర్పంచ్ మారపాక సుజన శ్రీనివాస్ అన్నారు. తాటికొండ గ్రామంలో అంగన్‌వాడీ టీచర్ల ఆధ్వర్యంలో పోషణ మాసం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సామూహిక సీమంతాలను చేపట్టారు. అంగన్‌వాడీ టీచర్లు పద్మ, ధనలక్ష్మీ, సులోచన, లలిత, అరుణాదేవి, ఏఎన్‌శ్రీం నాగరాణి, ఆశ కార్యకర్తలు మాధవి, సబీనా, రజిత, జ్యోతి, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.


