డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన

Oct 4 2026 9:55 AM | Updated on Oct 4 2026 9:55 AM

జనగామ రూరల్‌: సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్‌, గంజాయి నిర్మూలన కోసం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తన ఆట, పాటలతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు బహుజన యుద్ధనౌక డాక్టర్‌ ఏపూరి సోమన్న తెలిపారు. ఈ నెల 9న పట్టణంలోని జూబ్లీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, సీఐ సత్యనారాయణరెడ్డిలను హాజరుకావాలని ఆహ్వానించారు. కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్‌, కళాకారులు కడారి శ్రీను, జి.మౌనిక, పరమేష్‌, కె.ప్రవీణ్‌, పి.రేవంత్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement