నర్మెట: వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత పాటించాలని, పరిశుభ్రతే ఆరోగ్యానికి ప్రథమ ఔషదమని సర్పంచ్ ధరావత్ రాజమణి, వైద్య సిబ్బంది అన్నారు. ఇప్పలగడ్డలో శనివారం నిర్వహించి వైద్యశిబిరంలో పాల్గొన్న వారు మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురికి బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు తదితర పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యదర్శి శ్రీకాంత్, ధరావత్ రాజు, ఉప సర్పంచ్ శ్రీను, ఏఎన్‌ఎం సరిత, విజయశాంతి, ఆశ కార్యకర్త ప్రేమలత పాల్గొన్నారు.
మౌలిక వసతులు కల్పించాలి
జఫర్‌గఢ్: డబుల్‌బెడ్రూం ఇళ్లల్లో నివాసం ఉంటున్న వారికి మౌలిక వసతులు కల్పించాలని బీజేపీ మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని తమ్మడపల్లి (ఐ) గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసం ఉంటున్న పేదల సమస్యలను నగేష్‌గౌడ్ శనివారం అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలో నివాసం ఉంటున్న పేదలకు పట్టాలివ్వడంతో పాటు కనీస వసతులు కల్పించి వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పరిహారం అందజేత
దేవరుప్పుల: మండలంలోని రంబోజీగూడెం గ్రామ పరిది రాజీవ్‌నగర్‌కు చెందిన వ్యవసాయరైతు మేడ నర్సయ్యకు చెందిన ఎద్దు ఇటీవల విద్యుదాఘాతంలో మృతి చెందగా సదరు శాఖ అధికారులు రూ.40 వేల పరిహారం చెక్కును శనివార అందజేశారు. బాధిత రైతుకు విద్యుత్‌శాఖ ఏడీఏ అనిల్‌కుమార్, వెటర్నటీ డాక్టర్ శిల్ప పర్యవేక్షణలో సత్వరమే పరిహారం చెక్కు అందించినందుకు సర్పంచ్ పరీదుల ధనలక్ష్మీ భాస్కర్‌గౌడ్, రైతులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.


