గ్రామసభ ఆమోదంతోనే ఇళ్లు మంజూరు చేయాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామసభ ఆమోదంతోనే ఇళ్లు మంజూరు చేయాలి

Oct 4 2026 9:55 AM | Updated on Oct 4 2026 9:55 AM

లింగాలఘణపురం: గ్రామసభ ఆమోదంతోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని పలువురు సర్పంచ్‌లు డిమాండ్‌ చేశారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డి అధ్యక్షతన మండల స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల కేంద్ర సర్పంచ్‌ ఎడ్ల లావణ్యరాజు మాట్లాడుతూ రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం జాబితాను గ్రామ పంచాయతీల నుంచి పంపించాలని ఎవరు అడుగలేదని, తప్పనిసరిగా తీర్మానం ఉండాలని డిమాండ్‌ చేశారు. రెండు నెలలుగా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ లేకపోవడంతో గ్రామాల్లో ఇబ్బందులు ఎదురౌతున్నాయని నెల్లుట్ల సర్పంచ్‌ నర్సింగ రామకృష్ణ అన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలని, అప్పుడే మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులు మంజూరు అవుతాయని ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డి అన్నారు. సమావేశంలో ఎంపీఓ సంపత్‌కుమార్‌, మండల వైద్యాధికారి ఉదయ్‌కిరణ్‌, ఏఓ నజీరుద్ధీన్‌, ఏఈలు కార్తీక్‌, భరత్‌, నజీబ్‌, ఏపీఎం జ్యోతి, పశువైద్యాధికారి జలేందర్‌రెడ్డి, సీడీపీఓ మణెమ్మ, సర్పంచ్‌లు విష్ణుకుమార్‌, బుచ్చిరెడ్డి, సదానందం, మమత, సుమలత, సంతోషి, శోభ, సుజాత, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. కాగా, మండలంలోని 21 మంది సర్పంచ్‌లకు సగం మంది హాజరు కాలేదు. ఏనెబావి సర్పంచ్‌ సుజాతకు బదులుగా ఆమె భర్త సిద్దులు పాల్గొనగా విలేకరులు ఫొటో తీయగానే అక్కడి నుంచి జారుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement