చిల్పూరు: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణాజీగూడెం గ్రామంలో శనివారం నిర్వహించిన సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. మండల కార్యదర్శి సాదం రమేష్, పోలు సంపత్, రాజు, ప్రభాకర్, బర్మ రవి, కోమల, బుచ్చిరాజు, కుమార్, లింగయ్య, భీమయ్య రామరాజు పాల్గొన్నారు.
5న బైక్ ర్యాలీ
పాలకుర్తి టౌన్: ఎన్నికల సంఘం నిర్ణయాలపై అనుమాలు తలెత్తడం ఆందోళనకరమని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోగు శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఈసీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈనెల 5న సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్, సీపీఎం నాయకులు నిర్ణయించారు. సీపీఎం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


