ఫ్యాన్లు లేక రోగుల అవస్థలు | - | Sakshi
Sakshi News home page

ఫ్యాన్లు లేక రోగుల అవస్థలు

Oct 4 2026 9:55 AM | Updated on Oct 4 2026 9:55 AM

జనగామ: జిల్లా కేంద్రంలోని పురపాలక కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తున్న తెలంగాణ డయాగ్నొస్టిక్‌ రేడియాలజీ హబ్‌కు వివిధ వైద్య పరీక్షల కోసం వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌, డిజిటల్‌ ఎక్స్‌రే తదితర సేవల కోసం వచ్చే పేషెంట్లు పరీక్షల కోసం సుమారు గంట పాటు వేచి ఉండాల్సి వస్తుండగా, వెయిటింగ్‌ హాల్‌లో ఒక్క ఫ్యాన్‌ కూడా లేకపోవడంతో ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. వృద్ధులు, మహిళలు, అనారోగ్యంతో ఉన్న రోగులు ఎక్కువసేపు వేచి ఉండే సమయంలో ఇబ్బందులు అధికంగా ఉంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. రోగుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెయిటింగ్‌ హాల్‌లో ఫ్యాన్లు ఏర్పాటు చేసి, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులు, నిర్వాహకులను ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement