చిల్పూరు: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదంటూ ఆర్డీఓ కార్యాలయ అధికారికి రైతులు వినతి పత్రం అందజేశారు. నష్కల్ గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో శనివారం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం భూములను సేకరించే ప్రతిపాధనపై నష్కల్, వంగాలపల్లి గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి శాగంటి మణి ఆధ్వర్యంలో రైతులు తమ జీవనాధారమైన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని అధికారులకు స్పష్టం చేశారు. సీనియర్ అసిస్టెంట్లు ఉపేందర్, సత్యనారాయణ, చిల్పూరు ఆర్‌ఐ లోకేష్, నష్కల్ జీపీఓ యాకయ్య, రైతులు గంటె లక్ష్మి, రాజేష్, అనీల్, పాశం దాసు, భిక్షపతి, కరుణాకర్, యోబు, వినోద్, బాబు తదితరులు పాల్గొన్నారు.


