హేమాచల క్షేత్రంలో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

హేమాచల క్షేత్రంలో ప్రత్యేక పూజలు

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

మంగపేట: మండలపరిధిలోని హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభూ స్వామి వారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మికి పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు అనిపెద్ది రాజీవ్‌శర్మ, కారంపుడి పవన్‌కుమార్‌ ఆచార్యులు, వెంకటనారాయణ శర్మ స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement