మద్యంపై పల్లెల్లో యుద్ధం! | - | Sakshi
Sakshi News home page

మద్యంపై పల్లెల్లో యుద్ధం!

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

● తొమ్మిది గ్రామాల్లో సంపూర్ణ

మద్య నిషేధం

● మరికొన్ని గ్రామాల్లోనూ నిషేధం

దిశగా అడుగులు

● చొరవ తీసుకుంటున్న మహిళలు,

సహకరిస్తున్న యువత

రఘునాథపల్లి: మద్యంపై పల్లెలు యుద్ధం చేస్తున్నాయి. పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డుపైకి తీసుకు వ స్తుండటంతో పాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మహమ్మారిని పారద్రోలేందుకు ప్రజలు నడుం బిగిస్తున్నారు. ఇక్కడ పార్టీ, వర్గం, మహిళలు, పురుషులు అన్న తేడా లేకుండా ఏకమవుతున్నారు. బతుకులు ఆగం చేస్తున్న మద్యం గ్రామాల్లో విక్రయించవద్దంటూ నినదిస్తున్నారు. బెల్ట్‌ దుకాణం నడపొద్దని మొదట విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు, అప్పటికీ వినకుంటే అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయినా ఫలితం లేకుంటే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. మండలంలోని తొమ్మిది గ్రామాల్లో సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉండగా, వెల్ది గ్రామంలో బెల్ట్‌ నిర్మూలనకై ఇటీవల గ్రామ పంచాయతీ తీర్మానం చేశారు. మరిన్ని పల్లెలు అదే దారిన నడిచేందుకు సిద్ధమవుతున్నారు. మద్య నిషేధానికి మహిళలు, యువత కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. సర్పంచ్‌లు, గ్రామపెద్దలు మద్య నిషేధం దిశగా చొరవ తీసుకుంటున్నారు. తీర్మానాలు చేసి కఠినంగా అమలు చేయాలని నిర్ణయిస్తున్నారు.

వేలం పాడిన గ్రామాల్లోనూ..

బెల్ట్‌షాపుల కోసం బహిరంగ వేలం నిర్వహించే ఇబ్రహీంపూర్‌, ఫతేషాపూర్‌లో మద్య నిషేధం సంపూర్ణంగా అమల్లోకి వచ్చింది. ఇబ్రహీంపూర్‌లో ఎనిమిది నెలల క్రితం పార్టీలకతీతంగా ఏకమైన యువత, మహిళలు బెల్ట్‌ దుకాణాలను మూసి వేయించాయి. ఫతేషాపూర్‌లో ఆరు నెలలుగా మద్య నిషేధం కోసం ర్యాలీలు తీసి మద్యంతో గ్రామస్తులకు జరిగే నష్టాన్ని బెల్ట్‌షాపు నిర్వహకులకు వివరించారు. అయినా ఫలితం కనిపించలేదు. దీంతో గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీహరి దృష్టికి మహిళలు తీసుకెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే సీఐ వేణు, ఎస్సై నరేష్‌లను బెల్ట్‌షాపులు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో బెల్ట్‌షాపులు మూసివేశారు.

అధికారులను కలిసి తీర్మానాలు

గ్రామాల్లో మద్య నిషేధంపై చేసిన తీర్మానాల ప్రతులను ఆయా గ్రామాల సర్పంచ్‌లు మహిళలు, గ్రామ పెద్దలతో కలిసి ఎస్సై, సీఐ, తహసీల్దార్‌లను కలిసి అందజేశారు. బెల్ట్‌షాపులు నడవకుండా సహకరించాలని కోరారు. జిల్లా అధికారులకు కూడా తీర్మాన ప్రతులను అందజేసి మద్యం నిర్మూలనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మద్యపాన నిషేధ గ్రామాలు ఇవే..

ఇబ్రహీంపూర్‌, దాసన్నగూడెం, లక్ష్మీతండా, వేపలగడ్డతండా, కుసుంబాయితండా, జాఫర్‌గూడెం, ఫతేషాపూర్‌, కన్నాయపల్లి, భాంజీపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement