విద్యుత్‌ బిల్లుల భారం తగ్గించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ బిల్లుల భారం తగ్గించుకోవాలి

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

● ఎన్‌పీడీసీఎల్‌ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి

జనగామ: ప్రతీ కుటుంబం సౌరవిద్యుత్‌ను విని యోగించుకోవడం ద్వారా విద్యుత్‌ పొదుపుతో పా టు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ఎన్‌పీడీసీఎల్‌ డీఈ ఎం.లక్ష్మీనారాయణరెడ్డి పిలుపునిచ్చా రు. ప్రధానమంత్రి సూర్య ఘర్‌–సేవా సేతు పథకంపై శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో ప్రజ లకు అవగాహన కల్పించారు. డీఈ అధ్యక్షతన జ రిగిన కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణిశ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ పర్వతాలు, కౌ న్సిలర్లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సౌర విద్యుత్‌ విక్రేతలు, బ్యాంకర్లు పాల్గొని పథకానికి సంబంధించిన వివరాలను ప్రజలకు వివరించారు. అనంతనం డీఈ మాట్లాడుతూ గృహాల పైకప్పులపై రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని గృహ విద్యుత్‌ అవసరాలను తీర్చుకోవడంతో పాటు విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాముకుంట్ల ప్రసాద్‌గౌడ్‌, బుక్కా బాలభరధ్వాజ్‌, బూడిద జ్యోతిగోపి, మంత్రి సుమలతశ్రీశైలం, ఏఈడీ డి.వేణుగోపాల్‌, ఏఈలు బి.సౌమ్య, చంద్రమోహన్‌, రాజ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌లో..

స్టేషన్‌ఘన్‌పూర్‌: ప్రధానమంత్రి సూర్య ఘర్‌–సేవా సేతు పథకంను సద్వినియోగం చేసుకోవాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ డీఈ బి.సారయ్య అన్నారు. వి ద్యుత్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో మూడు రోజు లుగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు శని వారంతో ముగిశాయి. ఈ సందర్భంగా డీఈ మా ట్లాడారు. ఏడీఈ రణధీర్‌రెడ్డి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement