పాలకుర్తి సమగ్ర అభివృద్ధికి సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

పాలకుర్తి సమగ్ర అభివృద్ధికి సహకరించాలి

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

● మంత్రిని కోరిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

పాలకుర్తి టౌన్‌: పాలకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కోరారు. హైదరాబాద్‌లో శనివారం మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ను టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలయ్యేలా పనిచేయాలని మంత్రి అన్నారు.

మహిళల సమస్యల పరిష్కారానికి

కృషిచేయాలి

మహిళల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మహిళా కమిషన్‌ మరింత కృషి చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన నేరేళ్ల శారదను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement