బ్యాడ్మింటన్‌ జాతీయస్థాయి పోటీలకు కావ్యశ్రీ | - | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌ జాతీయస్థాయి పోటీలకు కావ్యశ్రీ

Oct 3 2026 1:26 AM | Updated on Oct 3 2026 1:26 AM

రఘునాథపల్లి: మండలంలోని అశ్వరావుపల్లి ఉన్నత పాఠశాల కు చెందిన పదో తరగతి విద్యార్థిని ప్యారాల కావ్యశ్రీ జాతీయ స్థాయి సబ్‌ జూనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపికై న ట్లు పాఠశాల హెచ్‌ఎం శోభన్‌బాబు, పీఈటీ మచ్చ రాజేందర్‌ శుక్రవారం తెలిపారు. మెదక్‌ జిల్లా బీహెచ్‌ఎల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కావ్యశ్రీ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ నెల 3,4, 5,6,7 తేదీల్లో చత్తీస్‌గఢ్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో కావ్యశ్రీ పాల్గొంటుందన్నారు. ఈ సందర్బంగా కావ్యశ్రీని సర్పంచ్‌ చైతన్య రాజు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్‌ రేణుక, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement