రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలు ప్రారంభం

Oct 3 2026 1:26 AM | Updated on Oct 3 2026 1:26 AM

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో 52వ రాష్ట్రస్థాయి బాలుర కబడ్డీ పోటీలు, 36వ రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 68 జట్లకు చెందిన 1,300 మందికి పైగా క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు, పీఈటీలు, పీడీలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల క్రీడాకారులు చేసిన మార్చ్‌ఫాస్ట్‌ ఆకట్టుకుంది.

ఉత్తమ ఉపాధ్యాయుడిగా గణేష్‌ కందగట్ల

రఘునాథపల్లి: గాంధీ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌ లాల్‌బహదూర్‌ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని వెల్ది మోడల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాల పీజీజీ ఆంగ్ల ఉపాధ్యాయుడు గణేష్‌ కందగట్ల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్టాన్‌ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశాయి. ఈసందర్భంగా పురస్కారం అందుకున్న గణేష్‌ కందగట్లకు ప్రిన్సిపాల్‌ పాలకుర్తి శ్రీధర్‌, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.

దేవాదుల, ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చేయాలి

పాలకుర్తి టౌన్‌: నియోజకవకర్గంలోని రైతుల పంటలు కాపాడేందుకు దేవాదుల, శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి వెంటనే సాగునీరు విడుదల చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని కలిసి రైతుల సమస్యల ను వివరించారు. సాగునీరుందక వరి పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి రెండ్రోజుల్లో దేవాదుల నీటిని విడుదల చేస్తామని, ఎస్సారెస్పీ నీటి అంశాన్ని అధి కారులతో చర్చించి నిర్ణయం తీసుకుటామని హామీ ఇచ్చినట్లు దయాకర్‌రావు తెలిపారు.

5న స్పాట్‌ అడ్మిషన్లు

కేయూ క్యాంపస్‌ : కేయూ ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ కోర్సులో మిగిలిన 8 సీట్ల భర్తీకి ఈ నెల 5న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు విద్యార్హతల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఫీజుతో సహా ఫార్మసీ కళాశాలకు హాజరు కావాలని సూచించారు. ఎప్‌సెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు స్పాట్‌ ఫీజుగా రూ.1,300, అర్హత సాధించని అభ్యర్థులు రూ 2,100 ఫీజు చెల్లించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement