ఓటు హక్కు పరిరక్షణకు కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు పరిరక్షణకు కార్యాచరణ

Oct 3 2026 1:26 AM | Updated on Oct 3 2026 1:26 AM

● ప్రకటించిన ఇండియా కూటమి ప్రతినిధులు

జనగామ: ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇండియా కూటమి, టీపీసీసీ పిలుపు మేరకు జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రతినిధులు ప్రకటించారు. ‘సేవ్‌ డెమోక్రసీ వీక్‌–ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ కార్యక్రమాల్లో భాగంగా డీసీసీ కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు ధన్వంతి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీతో పాటు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్‌. రాజారెడ్డి, జిల్లా నాయకుడు మోకు కనకారెడ్డి, టీపీసీసీ సభ్యుడు, వైటీడీఏ మెంబర్‌ డాక్టర్‌ ఎల్‌.లక్ష్మీనారాయణ నాయక్‌ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపు, ఓట్‌ చోరీ ఆరోపణలు, ఓటు హక్కు పరిరక్షణ తదితర అంశాలపై నాయకులు చర్చించామన్నారు. ఓటు హక్కు పరిరక్షణకు అన్ని పార్టీలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 3వ తేదీన మండల కేంద్రాల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులతో సంయుక్త సమావేశాలు, 5న మండల కేంద్రాల్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ర్యాలీలు, 8న జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో నాయకులు బూడిద గోపి, జోగు ప్రకాష్‌, ఆది సాయన్న, ఎనగంధుల ఉమాపతి, ఎర్రమల్ల సుధాకర్‌, వేమళ్ల సత్యనారాయణరెడ్డి, వేముల మల్లేష్‌, ఇందిరా, మాజిద్‌ అప్సర్‌, జాయ మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement