పోరాటస్ఫూర్తి నల్లా నర్సింహులు | - | Sakshi
Sakshi News home page

పోరాటస్ఫూర్తి నల్లా నర్సింహులు

Oct 3 2026 1:26 AM | Updated on Oct 3 2026 1:26 AM

జనగామ: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపిన కామ్రేడ్‌ నల్లా నర్సింహులు పోరాట స్ఫూర్తిని భవిష్యత్‌ తరాలకు అందించాలని వక్తలు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో నల్లా నర్సింహులు శత జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌ ఎదుట ఉన్న నల్లా నర్సింహులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జయంతి సభ నిర్వహించారు. నల్లా నర్సింహులు శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభకు, రాష్ట్ర కార్యదర్శి గునిగంటి చంద్రశేఖర్‌గౌడ్‌, మంగళంపల్లి రాజు కార్యక్రమాన్ని పర్యవేక్షించగా, సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నర్సింగ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్సింగ్‌ రావు మాట్లాడుతూ.. నల్లా నర్సింహులు వెట్టిచాకిరి, దొరల దోపిడీ, భూస్వాముల పీడన, అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. కార్యక్రమంలో నల్లా అరుణ, సామాజిక ఉద్యమకారుడు, రచయిత పాశం యాదగిరి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యేల్‌, బీసీ ఇంటలెక్చువల్స్‌ ఫోరం చైర్మన్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ చిరంజీవులు, బీసీ ఉద్యమకారుడు వట్టె జానయ్య యాదవ్‌, జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌న్‌ కడకంచి బాలమణిశ్రీనివాస్‌, స్థానిక కౌన్సిలర్లు, వివిధ కుల, బీసీ, బహుజన సంఘాల ప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement