జనగామ రూరల్: గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో 157వ గాంధీ జయంతి, 122వ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి మహనీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈసందర్భంగా 12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి, 2 స్వర్ణ పతకాలు, 4 రజత పతకాలు సాధించగా వారిని కలెక్టర్ అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహ రావు, అధికారులు పాల్గొన్నారు.


