జనగామ రూరల్: పట్టణంలో మూడో విడత డబు ల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం స్థలం ఇచ్చిన లబ్ధిదారులకే పట్టాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మూడో రోజు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేక ఇల్లు కట్టుకోలేని 72 మందికి డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తూ 2023 జూలైలో అప్పటి కలెక్టర్ ఆదేశంతో డ్రా తీసి వారికి ఇళ్లు కేటాయించారన్నారు. ఇటీవల ఆన్‌లైన్‌లో డబుల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ డ్రా తీశారని, పట్టాలు ఉన్న వారిని విస్మరించడం సరికాదన్నారు. ఇప్పటికై నా న్యాయబద్ధంగా అర్హులైన పట్టాలు కలిగి ఉన్న డబుల్ బెడ్ రూముల్లో నివాసం ఉంటున్న పేదలకే పట్టాలు ఇవ్వాలన్నారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని పేదలకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బూడిది గోపి, సుంచు విజేందర్, ఎండీ అజారుద్దీన్, కౌన్సిలర్ బూడిది జ్యోతి, కళ్యాణం లింగం, పల్లెర్ల లలిత, జయ, ఎండీ గౌసియా, కచగళ్ళ వెంకటేష్, మాదాసి సుధాకర్, సిలివేరు ఉపేందర్, పద్మ, అందాల, కమల, నాజియా, రేణుక కవిత, శశిరేఖ, సంతోష, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.


