బాహ్య మూల్యాంకన విధానాన్ని రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

బాహ్య మూల్యాంకన విధానాన్ని రద్దు చేయాలి

Oct 1 2026 4:34 AM | Updated on Oct 1 2026 4:34 AM

జనగామ రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో హోమ్‌ ఎగ్జామ్స్‌కు సంబంధించి ఒకటి నుంచి పదో తరగతి వరకు బాహ్య మూల్యాంకనం విధానాన్ని తక్షణమే ఉపసంహరించు కోవాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు ఎన్‌.ఎన్‌. రాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధనా పరిస్థితులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, ఉపాధ్యాయుల కొరత, పాఠశాలల్లో అందుబాటులో ఉన్న వసతులను పరిగణనలోకి తీసుకోకుండా సమస్యలు పరిష్కరించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదన్నారు. జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ బాహ్య మూల్యాంకనాన్ని భవిష్యత్తులో ప్రవేశపెట్టాలనుకుంటే కనీసం మూడు సంవత్సరాల ముందస్తు ప్రణాళికతో, ఉపాధ్యాయులకు తగిన శిక్షణ, విద్యార్థులకు అభ్యసన సంసిద్ధత కల్పించి, అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ అంకుషావలి, కుర్రేముల యాదగిరి, లక్మయ్య, వై.వజ్రయ్య, యు.శ్రీహరి, లక్మణ్‌ జీ, బానోతు వెంకన్న, సత్యనారాయణ రెడ్డి, దూడల రమేష్‌, శారదమ్మ, జే.రాజేంద్ర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement