● సీనియర్ సివిల్ జడ్జి శంకర శ్రీదేవి
జనగామ రూరల్: పిల్లలు భవిష్యత్‌లో విద్యావంతులుగా ఎదగాలని సీనియర్ సివిల్ జడ్జి శంకరశ్రీదేవి అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మే రకు బుధవారం పట్టణంలోని బాల సదనంను సందర్శించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యంతో చదవాలన్నారు. అనంతరం విద్యార్థినులకు ఇంగ్లిష్ టు తెలుగు నిఘంటువులు అందించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ వరోనిక, వార్డెన్ నివేదిక, స్రవంతి పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని సబ్‌జైల్‌ని సందర్శించారు. ఖైదీలతో బెయిల్ అంటే ఏమిటీ? ఎలా పొందాలి? న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ స లహాలు, తదితర విషయాలు వివరించారు. సూపరింటెండెంట్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.


