జనగామ: వర్షాకాలంలో వరద నీరు, డ్రెయినేజీ సమస్యలు, నీటినిల్వలు, లీకేజీలను తక్షణమే పరి ష్కరించేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. వర్షం కురుస్తున్న సమయంలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి డ్రెయినేజీల పరి స్థితి, వరద నీటి ప్రవాహం, నీటి నిల్వలను పరి శీలించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. వర్షాల సమయంలో నీరు నిలిచిపోవడం, డ్రెయినేజీలు పొంగిపొర్లడం, లీకేజీలు లేదా వరద నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడితే ప్రత్యేక బందాలు వెంటనే అక్కడికి చేరుకుని చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేశారు.


