జనగామ రూరల్: జిల్లా అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి సకాలంలో చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశా) కమిటీ చైర్‌పర్సన్ కడియం కావ్య అధి కారులను ఆదేశించారు. వ్యవసాయ రంగానికి అధి క ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మంగళవా రం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిపై జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్ దిశా కమిటీ సభ్యురాలు కేసిరెడ్డి మాధవి, దిశా కమిటీ సభ్యులు బక్క శ్రీను, కొర్ర వెంకటేష్ నాయక్, మున్సిపల్ చైర్మన్‌లు కడకంచి బాలమణి, తాటికొండ వినయ్‌కుమార్ హాజరయ్యారు. పలు శాఖల అధికారులు తమ శాఖల్లో అమలవుతున్న పథకాలపై వివరించారు. అనంతరం ఎంపీ కావ్య మాట్లాడుతూ.. జిల్లాలో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య అందించడం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్ప న, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీసుకుంటున్న ప్రత్యేక చొర వ అభినందనీయమన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద మంజూరు చేసిన మూడు నెలల్లో పనులు ప్రారంభం కాకపోతే వెంటనే వాటిని రద్దు చేయాల ని, వినియోగించిన నిధులను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నవీకరించాలని ఆదేశించారు. పట్టణ మురుగునీరు నెల్లుట్ల చెరువులోకి చేరకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సొంత భవనాలు లేని అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ సూచించారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, కిరణ్ ప్రకాష్, మున్సిపల్ కమిషనర్లు రాజశేఖర్ రెడ్డి, రాధాకృష్ణ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
15ఎస్టీజీ059–సమావేశంలో మాట్లాడుతున్న ఏఐఎస్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్
దిశా కమిటీ సమావేశంలో చైర్‌పర్సన్, వరంగల్ ఎంపీ కడియం కావ్య


