ఆన్‌లైన్ లావాదేవీలు విస్తరిస్తున్న వేళ యూపీఐ చా ర్జీల భారం మధ్య తరగతి ప్రజలపై భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) తీసుకురావడంతో మరింత భారం పడనుంది. ఫలితంగా మార్కెట్‌లో పోటీ ఉంటే మార్జిన్ తగ్గించుకోవడం, లేకపోతే చార్జీలను ధరలో కలపడం తప్పదని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో సుమారు 70 శాతం లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. రూ.2 జిరాక్స్ నుంచి రూ.2 లక్షల కొనుగోళ్ల వరకు యూపీఐ వినియోగం పెరిగింది. రోజుకు రూ.10 వేల ఆన్‌లైన్ వ్యాపారం చేసే వీధి వ్యాపారికి సైతం సుమారు రూ.200 వరకు అదనపు చార్జీ పడే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుత యూపీఐ చార్జీల విధానం, రేట్లు, భారం ఎవరిపై పడుతుందన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలో రోజు వారీగా సుమారు రూ.75 కోట్ల వ్యాపారం జరుగుతుండగా, అందులో రూ.16.26 కోట్లకు పైగా ఆన్‌లైన్ లావాదేవీలే జరుగుతున్నాయి.
డిజిటల్ చెల్లింపుల్లో ఉచితాల కాలానికి పరిమితులు విధించే అడుగులు పడుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న యూపీఐ లావాదేవీలపై నిర్వహణ వ్యయాన్ని తట్టుకునేందుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పరిమితి దాటిన పెద్ద మొత్తాల వర్తక లావాదేవీలపైనే చార్జీలు పడే అవకాశం ఉండటంతో వర్తక వ్యాపారులు (ఆన్‌లైన్) హద్దులు దాటకుండా జాగ్రత్త
పడాల్సిన అవసరం ఉంది. –జనగామ
ఆన్‌లైన్ లావాదేవీలపై
కొత్త నిబంధనలు
వినియోగదారుడికి భారం లేదు
అక్టోబర్ 15 నుంచి అమలులోకి..
జిల్లాలో రోజువారీగా
రూ.16.26 కోట్ల ఆన్‌లైన్ లావాదేవీలు
రూ.2వేలకు మించితే..
వచ్చే నెల 15 నుంచి రూ.2వేలకు మించిన పర్సన్ టు మర్చంట్ చెల్లింపుల పై 0.4 శాతం ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు)ను వ్యాపారులు చెల్లించాలి. ఒక్కో లా వాదేవీకి గరిష్టంగా రూ.3 వేలకు రూ.12, రూ.50వేలకు రూ.200, రూ.75వేలకు లేదా అంతకంటే ఎక్కువకు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. పర్సన్ టు పర్సన్ బదిలీల సమయంలో రూ.2వేల వరకు యూపీఐ చెల్లింపులు పూర్తిగా ఉచితం కాగా చిన్న వ్యాపారులు నెలకు రూ.1 లక్ష వరకు స్వీకరించే చెల్లింపులకు ఎండీఆర్ మినహాయింపు ఉంటుంది.
జిల్లాలో రోజువారీ ఆన్‌లైన్ లావాదేవీలు
కేటగిరీ దుకాణాలు వ్యాపారం
(రూపాయల్లో)
మెడికల్ షాపులు 250 75లక్షలు
ఎలక్ట్రానిక్స్ 40 1.50కోట్లు
ఐరన్, సిమెంట్ 60 1కోటి
బార్, రెస్టారెంట్, వైన్స్ 56 50లక్షలు
కిరాణం, జనరల్ 650 4.25కోట్లు
(హోల్‌సేల్, రిటైల్)
ఫర్టిలైజర్స్ 200 1కోటి
(సీజనల్ వ్యాపారం)
చిరు వ్యాపారాలు 1,000 1కోటి
ప్రైవేట్ హాస్పిటల్స్ 150 50లక్షలు
(చిన్నా,పెద్ద)
హోటల్స్ 110 1.20కోట్లు
(రెస్టారెంట్లు, దాబా, టీ)
పెట్రోల్ బంకులు 93 51లక్షలు
బట్టల దుకాణాలు 80 1కోటి
మటన్, చికెన్ 100 20లక్షలు
ఆటో మొబైల్స్, టైర్స్ 35 35లక్షలు
ఎలక్ట్రికల్స్, మోటార్స్ 100 1కోటి
టైల్స్ 20 50లక్షలు
ఏజెన్సీలు 30 1కోటి


