హోల్‌సేల్ దుకాణాల నుంచి వేల రూపాయల సరుకులు తెస్తాం. వ్యాపారులపై పన్ను విధిస్తే ఆ భారాన్ని కస్టమర్లపైనే వేయాల్సి వస్తుంది. ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే గిరాకీ తగ్గుతుంది. – పులిగిల్ల పాండురంగం,
బచ్చన్నపేట
ప్రభుత్వం యూపీఐకి అలవాటు చేసిన తర్వాత ఇప్పుడు అధిక టర్నోవర్ వ్యాపారులపై చార్జీలు విధిస్తే, భవిష్యత్‌లో ఆ భారాన్ని కొనుగోలుదారులపైనే మోపే అవకాశం ఉంది. విధానాన్ని ఉపసంహరించాలి.
– అంచూరి సురేష్,
వినియోగదారుడు, జఫర్‌గఢ్
ఫోన్‌న్‌పే, గూగుల్‌పే వంటి డిజిటల్ లావాదేవీలపై చార్జీలు విధిస్తే వాణిజ్య వ్యాపారాలు దెబ్బతింటాయి. వ్యాపారులు, వినియోగదారులపై భారం పడకుండా కేంద్రం సానుకూలంగా స్పందించాలి.
– దిడ్డి సత్యనారాయణ,
కిరాణా షాపు, స్టేషన్‌ఘన్‌పూర్


