● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు శిబిరంలో అన్ని వసతులు కల్పించడంతో పాటు నా ణ్యమైన ఉపకరణాలు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. బు ధవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో సమగ్ర శిక్ష, భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ సంయుక్తంగా సహాయ ఉపకరణాల గుర్తింపు, నిర్ధారణ శిబిరాన్ని ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగవైకల్యంతో శిబిరానికి వచ్చిన వారికి సరైన వైద్య పరీక్షలు నిర్వహించాలని, పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు భోజనం, వసతులు కల్పించాలన్నారు. నిర్ధారణ ఆధారంగా ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, చేతికర్రలు, కాలిపర్స్, తదితర సహాయ ఉపకరణాలు సరఫరా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అధికారి ఎస్. ప్రకాష్, సీఎంఓ నాగరాజు, వైద్యులు పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు..
విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి పాఠశాలలోని తరగతి గదులు, డిజిటల్ తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి, హిందీ, సైన్స్ సబ్జెక్టుల్లో వారి అభ్యాస సామర్థ్యాన్ని పరీక్షించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించారు.
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి
బచ్చన్నపేట: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. బుధవారం మండలంలోని కేసిరెడ్డిపల్లి, భోనకొల్లూర్ గ్రామాల్లో పర్యటించి వివిధ పంటల క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.


