మహోజ్వల ఘట్టం
తెలంగాణ సాయుధ
పోరాట చరిత్ర మరువలేనిది
జనగామ/జఫర్‌గఢ్: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం తెలంగాణ ప్రజలు సాగించిన సాయుధ పోరాటంలో జఫర్‌గఢ్ మండలంలోని తమ్మడపల్లి(జి) గ్రామంలో 12 మంది కమ్యూనిస్టు పోరాట యోధులు అమరులయ్యారు. అప్పట్లో నైజాం పాలకుల ఏజెంట్లుగా వ్యవహరించిన రజాకార్ల నాయకుడు ఖాదరెల్లి జఫర్‌గఢ్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతుల నుంచి లేవి, శిస్తు, తాటి చెట్ల పన్నులు వసూలు చేసేందుకు జవానులను గ్రామాలకు పంపి పీడించేవాడు. శిస్తులు చెల్లించని వారిని దోపిడీ, దౌర్జన్యకర విధానాలతో శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేయడంతో పాటు మహిళలను చెరబట్టి అత్యాచారాలకు పాల్పడేవారు. ఈ ఆగడాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు దళ నాయకులు నల్ల నర్సింహులు, కృష్ణమూర్తి, యాదగిరిరావు, నెల్లుట్ల మోహన్‌రావు నేతృత్వంలో ఈ ప్రాంత ప్రజలు రజాకార్ల నాయకుడు ఖా దరెల్లి ఇంటిపై దాడి చేశారు. దీంతో రజాకార్లు తమ్మడపల్లి(జి)గ్రామాన్ని చుట్టుముట్టి గ్రామానికి చెందిన 20 మందిని బందించారు. ఈ ఘట నలో చాడ అనంతరెడ్డి, బత్తిని బక్క రాజయ్య, దొంతూరి చిన్న రాజయ్య, ఎరుకల ఇద్దయ్య, గుం డెమల్ల పోశాలు, చెదలు నర్సయ్య, ఎండీ ఖాసీం, రామయ్య, దిడ్డి పెరుమయ్య, కొమటి నర్సింహరామయ్య, కుంట పెద్దాపురం అక్కడికక్కడే అసువులు బాశారు. కూనూర్ గ్రామానికి చెందిన నెల్లుట్ల సుశీలదేవి అలియాస్ అచ్చమాంబ కూడా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఆమె భర్త మోహన్‌రావు మృతి చెందగా, వృద్ధాప్యంలో ఉన్న సుశీలదేవి ప్రస్తుతం వరంగల్‌లోని శాంతినగర్‌లో నివాసముంటున్నారు.
తమ్మడపల్లి (జి)లో
రజాకార్ల దమనకాండ
జిల్లాలో సాయుధ పోరాట జ్ఞాపకాలు
నైజాం పాలనకు
వీరోచితంగా పోరాటాలు
పుస్తకాల్లో చదివి గుర్తు
చేసుకుంటున్న నేటి యువతరం
తెలంగాణ గడ్డపై పేద రైతుల గుండెల్లో రగిలిన స్వేచ్ఛా జ్వాలే తెలంగాణ సాయుధ పోరాటం. నిజాం నిరంకుశ పాలన, జమీందారుల దోపిడీ, భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడారు. గ్రామీణ ప్రజల్లో హక్కులపై చైతన్యం రగిలించి, సామాజిక మార్పుకు బాటలు వేసిన ఈ ఉద్యమం తెలంగాణ చరిత్రలో త్యాగానికి, ధైర్యానికి, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది.
– మీసాల సుధాకర్, పీజీటీ,
తెలుగు, లింగాలఘణపురం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర మరువలేనిది. రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా సాగిన పోరులో అనేక మంది వీరులు తమ ప్రాణాలను కోల్పోయారు. జఫర్‌గఢ్ ప్రాంతంలో రజాకార్ల ఏజెంట్ ఖాదరెల్లికి వ్యతిరేకంగా సాగిన పోరులో కమ్యూనిస్టు వీరులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.
– ఉల్లి శివరాజు, ఎంఏ, జఫర్‌గఢ్


