వరంగల్‌ కమిషనరేట్‌ ముందంజ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ కమిషనరేట్‌ ముందంజ

Sep 16 2026 3:49 AM | Updated on Sep 16 2026 3:49 AM

దర్యాప్తు వేగం, ట్రాఫిక్‌ అమలులో.. వరంగల్‌ కమిషనరేట్‌ ముందంజ

దర్యాప్తు వేగం, ట్రాఫిక్‌ అమలులో..

సాక్షి, వరంగల్‌ : నేరం చేసిన వ్యక్తిలో భయం కలగాలంటే కేవలం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే సరిపోదు. నిందితుడిని గుర్తించి పట్టుకోవడం, దర్యాప్తును వేగంగా పూర్తి చేయడం, పక్కా ఆధారాలతో చార్జ్‌షీట్‌ దాఖలు చేయడం...ఆపై కోర్టులో నేరం రుజువై శిక్ష పడేలా చేయడమే అసలైన పోలీసింగ్‌కు గీటురాయి. ఈ మొత్తం ప్రక్రియలో ఏ ఒక్క దశలో లోపం ఏర్పడినా నేరస్తుల్లో భయం తగ్గే అవకాశముంది. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖ గత ఆరు నెలల పనితీరుతో రూపొందించిన ‘క్లస్టర్‌ వైజ్‌ యూనిట్స్‌ పెర్ఫార్మెన్స్‌ స్కోర్‌కార్డు’ ఉమ్మడి వరంగల్‌ ప్రాంతంలోని నాలుగు పోలీస్‌ యూనిట్ల పనితీరులో ఉన్న తేడాలను స్పష్టం చేస్తోంది. దర్యాప్తు వేగం, ట్రాఫిక్‌ అమలులో వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ ముందంజలో ఉండగా, భూపాలపల్లి, ములుగు శిక్షల శాతంలో మంచి ఫలితాలు సాధించాయి. చార్జిషీట్‌ల నమోదులో మహబూబాబాద్‌ ముందుంది. ఇలా అన్ని యూనిట్లు అన్నింట్లోనూ మెరుగైతే ఉమ్మడి వరంగల్‌లో నేరాల నియంత్రణ సులభమై నేరగాళ్లలో వణుకు పుట్టనుంది.

రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ల వారీగా ర్యాంకులిలా..

● క్లస్టర్‌–1లో ఐదు పోలీస్‌ కమిషనరేట్లు ఉంటే హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ మొదటి స్థానంలో ఉంటే, వరంగల్‌ కమిషనరేట్‌ రెండో స్థానంలో నిలిచింది.

● క్లస్టర్‌–3లో 11 పోలీసు యూనిట్లుండగా మహబూబాబాద్‌ అఖరి స్థానంలో నిలిచింది.

● క్లస్టర్‌–4లో 10 పోలీసు యూనిట్లుండగా జయశంకర్‌ భూపాలపల్లి 9వ, ములుగు 10వ స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఒకే ప్రాంతానికి చెందిన పోలీస్‌ యూనిట్ల మధ్య పనితీరు సూచీల్లో గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఇంకా మెరుగుపర్చుకోవాల్సిన అవసరముంది.

ట్రాఫిక్‌ నిబంధనల అమలు,

ఈ–చలాన్లు ఇలా..

ఆరు నెలల పనితీరుపై రాష్ట్ర పోలీస్‌శాఖ స్కోర్‌కార్డు

కేసు నమోదైన తర్వాత దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేయడం న్యాయ ప్రక్రియలో అత్యంత కీలక దశ. ఈ విషయంలో మహబూబాబాద్‌ నాలుగు యూనిట్లలో ముందుంది. ముఖ్యంగా ములుగులో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్‌ దాఖలు చేసే రేటు మిగిలిన యూనిట్లతో పోలిస్తే తక్కువగా ఉండటం కాస్త ఆందోళన కలిగించే అంశమని పోలీస్‌ వర్గాలు అంటున్నాయి.

శిక్షల శాతంలో భూపాలపల్లి,

ములుగు, చార్జిషీట్‌లో మహబూబాబాద్‌

నేరాల నియంత్రణలో మనోళ్ల

పెర్ఫార్మెన్స్‌ వెల్లడి

ఎఫ్‌ఐఆర్‌నుంచి శిక్షల వరకు

పనితీరుతో మార్కుల శాతం

అన్ని విభాగాల్లో మెరుగైతేనే

ఉమ్మడి వరంగల్‌లో నేరగాళ్లకు చెక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement