స్టేషన్‌ఘన్‌పూర్: టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖను ఇతర శాఖల్లో విలీనం చేయకుండా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌గానే యథాతథంగా కొనసాగించాలని టీపీ జేఏసీ నాయకులు సుదర్శన్‌రెడ్డి, యాదయ్య డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్‌ఘన్‌పూర్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది చేస్తున్న నిరసన కార్యక్రమాలు మంగళవారంతో 30వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా లంచ్ అవర్‌లో నిరసన వ్యక్తం చేశా రు. అనంతరం స్థానిక ఆర్‌డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి ఆర్‌డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలను అందించారు. కార్యక్రమంలో అశోక్, శ్రీధర్‌రెడ్డి, కిరణ్‌కుమార్, రవీందర్, శ్రీకర్, అనీల్‌కుమార్, సుదర్శన్‌రెడ్డి, రాజు, జావీద్‌పాషా, నరేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


