రాష్ట్రస్థాయి పోటీలకు కూనూర్‌ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు కూనూర్‌ విద్యార్థులు

Aug 3 2026 1:13 AM | Updated on Aug 3 2026 1:13 AM

జఫర్‌గఢ్‌ : మండలంలోని కూనూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి సీనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్‌ డైరెక్టర్‌ ఆకుల సాయికుమార్‌ ఆదివారం తెలిపారు. పాఠశాలకు చెందిన చెవనబోయిన పూజశ్రీ, సుతారి రిషిత, బుల్లె అమూల్య హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి సీనియర్‌ బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభ చూపారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలో జరుగనున్న రాష్ట్ర పోటీల్లో వీరు పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల బాల్‌బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా బాధ్యులు గాదెపాక అయోధ్య, కాటం రాజిరెడ్డి, కేశవరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఎండీ పర్వేజ్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement